నేడు ప్రభుత్వానిది – ప్రజాస్వామ్యానిది తామరాకు – నీటి కొలనుల సంబంధం కలిసే ఉన్నా అంటుకోవు ప్రజలది – ప్రభుత్వానిది అలకి – ఆకాశానికి ఉన్న సంబంధం అల ఎన్నటికీ ఆకాశాన్ని అందుకోలేదు ప్రజస్వామ్యానిది – ప్రజలది రైలు పట్టాల అనుబంధం సమాంతరమే కాని ఒకటి కాలేవు
మార్చి, 2010 నెల టపాలు
దగ్గరలో దూరం
Posted in కవితలు on మార్చి 30, 2010 | 1 అభిప్రాయం »
తీరేనా…?
Posted in పదరేఖలు on మార్చి 29, 2010 | Leave a Comment »
నా కళ్ళు వర్షిస్తున్నాయి ధారలుగా… కాని నేనాపడం లేదు కనీసం.. నా కన్నీళ్ళైనా కర్షకుల కరువును తీరుస్తాయేమోనని…
జీవితం
Posted in పదరేఖలు on మార్చి 29, 2010 | 1 అభిప్రాయం »
ఒకనాటి మెలుకువతో మొదలై మరొకనాటి నిద్రతో ముగిసేది
తేడా
Posted in పదరేఖలు on మార్చి 29, 2010 | Leave a Comment »
నిన్న నిను చేరలేకపోవుట ఓ విరహం నేడు నిను చేరలేకపోవుట ఓ కలహం
చిత్రపటం
Posted in కవితలు on మార్చి 6, 2010 | 1 అభిప్రాయం »
ఆ చిత్రకారుడు పొదుపరో లేక రంగు అయిపోయినదో కాని ఆకాశంలో సన్నటి గీత గీసాడు అయినా నెలవంక కనపడుతోందిలే చిన్నపిల్లాడు రంగంతా పారబోశాడేమో ఆకాశం మరీ దట్టంగా నీలంగా ఉంది ఆ తల్లి వడియాలు ఆరబెట్టిందో ఏమో ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి ఏ తుంటరి వచ్చి ఒలకబోసాడో చిక్కటి పెరుగు – పేరుకుపోయింది మబ్బులా ఎవరి దిష్టి తగిలిందో గాని పగలంతా ఎర్రగానే ఉంది ఆకాశం అమ్మకెంత ఓపికో అంతసేపూ తీసింది దిష్టి.
Posted in ఫోటోలు on మార్చి 6, 2010 | 1 అభిప్రాయం »
Posted in ఫోటోలు on మార్చి 6, 2010 | Leave a Comment »