ఆ చిత్రకారుడు పొదుపరో లేక
రంగు అయిపోయినదో కాని
ఆకాశంలో సన్నటి గీత గీసాడు
అయినా నెలవంక కనపడుతోందిలే
చిన్నపిల్లాడు రంగంతా పారబోశాడేమో
ఆకాశం మరీ దట్టంగా నీలంగా ఉంది
ఆ తల్లి వడియాలు ఆరబెట్టిందో ఏమో
ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి
ఏ తుంటరి వచ్చి ఒలకబోసాడో
చిక్కటి పెరుగు – పేరుకుపోయింది మబ్బులా
ఎవరి దిష్టి తగిలిందో గాని
పగలంతా ఎర్రగానే ఉంది ఆకాశం
అమ్మకెంత ఓపికో
అంతసేపూ తీసింది దిష్టి.
కొంచెం బాగుంది