నేడు
ప్రభుత్వానిది – ప్రజాస్వామ్యానిది
తామరాకు – నీటి కొలనుల సంబంధం
కలిసే ఉన్నా అంటుకోవు
ప్రజలది – ప్రభుత్వానిది
అలకి – ఆకాశానికి ఉన్న సంబంధం
అల ఎన్నటికీ ఆకాశాన్ని అందుకోలేదు
ప్రజస్వామ్యానిది – ప్రజలది
రైలు పట్టాల అనుబంధం
సమాంతరమే కాని ఒకటి కాలేవు
మీ కవిత బాగుంది స్వల్ప శబ్దాలలో అనంతార్థాలు కనిపించేలా వ్రాసారు.