ఒక బట్ట సంచి భూమిలో కలవడానికి 3 సంవత్సరాలు పడుతుంది. ఒక కాగితపు సంచి కలవడానికి 1 సంవత్సరం పడుతుంది. కాని ఒక ప్లాస్టిక్ సంచి భూమిలో కలవాలంటే మాత్రం దాదాపు ఒక లక్ష సంవత్సరాలు పడుతుంది.అంతే కాదు , వాటిని తిన్న పశువులు, జంతువులు అవి అరగక అనేక అవస్థలు పడుతుంటాయి.
సమాజానికి మనవల్ల మేలు జరగకపోయిన పర్వాలేదు కనీసం కీడు జరగకూడదనుకుంటే మాత్రం , తక్షణం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలెడదాం.
చిన్నదో,పెద్దదో కాగితపు సంచినో లేక బట్ట సంచినో ,handbagలోను, వాహనాలలోను పెట్టుకుంటే చాలమట్టుకు ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించినవాళ్ళమవుతాము.
చక్కని సందేశాన్ని అందించారు. అసలు వాడకం ఆపివేయడం అసాధ్యమైనప్పటికినీ, సాధ్యమైనంతవరకు ప్లాస్టిక్ సంచుల కు ప్రత్యామ్నాయంగా మీరు చెప్పినట్లు కాగితపు సంచులని వాడితే మంచిది.
ఈ విషయమై ఆలోచించినందులకు ధన్యవాదములు.
USE PLASTICKS……….SAVE TREES……….
భూమిలో కలవని పదార్థాల వల్ల చెట్లు కాపడబడవు.